IPL 2026లో భాగంగా SRH తన తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. అయితే, ఈరోజు KKRపై విజయం సాధించి విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో జట్టు ఎంపిక కీలకం కానుంది. ఇప్పుడు కోల్కతా పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. సరైన కూర్పుతో బరిలోకి దిగితేనే KKRను ఓడించడం సాధ్యమవుతుంది. ఇప్పటివరకు KKR- SRH ముఖాముఖిగా 30 మ్యాచుల్లో తలపడ్డాయి. 20-10 తేడాతో కోల్కతా ఆధిక్యంలో ఉంది.