మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ విడుదల వాయిదా పడినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రూమర్లపై తాజాగా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. అనుకున్న తేదీకే సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేశాడు. దీంతో ఈనెల 30న ‘పెద్ది’ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.