ఢిల్లీ మెట్రో స్టేషన్(Delhi Metro Station)లో లవర్స్ ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి వీడియోలు ఇది వరకే సోషల్ మీడియాలో వైరల్(Viral) అయ్యాయి. ఇటువంటి సంఘటనలను నివారించేందుకు డిఎంఆర్సీ(DMRC) మెట్రో లోపల ఫ్లయింగ్ స్క్వాడ్ లను కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అలాంటి చర్యలు మాత్రం తగ్గడం లేదు. వాటిని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు. తాజాగా ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో ఓ జంట ముద్దు పెట్టుకుంటున్న వీడియో ట్విట్టర్లో వైరల్(Video Viral) అవుతోంది.
ఢిల్లీ మెట్రో(Delhi Metro) ఫ్లోర్ పై ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. వీడియో ఓ అబ్బాయి నేలపై కూర్చుని ఉంటే అతని ఒడిలో ప్రియురాలు పడుకుని ఉంది. వారిద్దరూ ఏమాత్రం తడబడకుండా లిప్ లాక్(Lip Lock) చేసుకోవడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియాలో ప్రేమికుల వీడియో వైరల్(Video Viral) కావడంతో పలువురు విమర్శలు గుప్పిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో(Delhi Metro) పేరును పోర్న్ హబ్‌గా మార్చాలంటూ మరికొంత మంది యూజర్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయి మద్యం మత్తులో ఈ పనిచేస్తున్నారని ఇంకొంత మంది కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.