VKB: పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా అనంతగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఈకో అర్బన్ పార్కు’ను సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారు. అంతకుముందు ఉదయం 10 గంటలకు ఎన్నెపల్లిలోని బసవేశ్వర భవన్లో నిర్వహించే బసవ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం 11:45 గంటలకు అనంతగిరి గుట్టపై పార్కును జాతికి అంకితం చేయనున్నారు.