NGKL: కల్వకుర్తి మండలం తర్నికల్లో నిర్వహించిన రోడ్డు భద్రతా సదస్సులో కలెక్టర్ బదావత్ సంతోశ్, ఎస్పీ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని ఎస్పీ హెచ్చరించారు. రహదారి నిబంధనలు పాటించి ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.