HNK: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈసీ కన్వీనర్ ఏ.గోపాల్ తెలిపారు. వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు ముందుగానే కేంద్రానికి రావాలని సూచించారు.