మంచిర్యాల జిల్లాలో కొనుగోలు చేసిన వరి ధాన్యం రవాణాకు సరిపడా లారీలను కేటాయించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు ఆదేశించారు. కలెక్టరేట్లో లారీల గుత్తేదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులు, గోదాములకు త్వరితగతిన తరలించాలన్నారు. ధాన్యం దిగుమతి వేగంగా జరిగేలా చూడాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.