ప్రకాశం: పామూరు (M) అయ్యన్నకోట గ్రామంలో పాత గొడవల నేపథ్యంలో శ్రీను అనే వ్యక్తిపై మరో వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి గ్రామంలో గ్రామోత్సవం జరుగుతున్న సందర్భంగా మరోసారి ఓంకార్ అనే వ్యక్తికి శ్రీనుకు గొడవ జరిగింది. రాయితో శ్రీను కంటి పై దాడికి పాల్పడగా శ్రీనుకు కంటికి తీవ్ర గాయం అయింది. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.