కాకినాడ జిల్లాలో గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు ఎండలు మండిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని, ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలని సూచించింది.