సత్యసాయి: జిల్లాలో అసాంఘిక శక్తులపై ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 11 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఎన్జీవోలు, న్యాయవాదులతో కలిసి ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తోటల్లో ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్లు దొంగిలించే ముఠాలను పట్టుకుని రైతులకు అండగా నిలిచారు.