HNK: హాసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.