NLG: నాగార్జునసాగర్ దిగువన కృష్ణా నది తీరంలో మొసళ్ల సంచారం పెరిగింది. చంద్రవంక వాగు వచ్చి కలిసే టైల్పాండ్ జలాశయం ప్రాంతంలో మొసళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల నది తీరంలో బట్టలు ఉతికే మహిళపై, నీటి కోసం వెళ్లే పశువులపై మొసళ్లు దాడులు చేసిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.