హనుమకొండ న్యూ శాయంపేటలో హనుమాన్ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా హిందూ మహా కమిటీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అంతరాయం కలిగించినందుకు 24 మందిపై కేసులు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ మేకల రంజిత్ కుమార్ తెలిపారు. బీఎన్ఎస్ 341, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు CI పేర్కొన్నారు.