GNTR: ఫిరంగిపురం గ్రామంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి నీటిని అందించే ప్రధాన పైపులైన్ పగిలిపోవడంతో సరఫరా ఆగిపోయిందని అధికారులు తెలిపారు. పైపులైన్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఈరోజు సాయంత్రానికి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి షేక్ ఫిరోజ్ తెలిపారు.