వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. లక్నో ప్రమోషన్స్‌లో వరుణ్ కోసం 5 గంటలు వేచి చూసినా, అతను 5 నిమిషాల్లోనే వెళ్లిపోయాడంటూ ఓ మహిళా అభిమాని ఇన్‌స్టాలో ఆవేదన చెందింది. దీనిపై వరుణ్ స్పందిస్తూ.. ‘క్షమించండి, పోలీస్ భద్రతా కారణాల వల్లే త్వరగా వెళ్లాల్సి వచ్చింది’ అని రీప్లై ఇవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.