SRD: అమీన్పూర్ మండలం, అమీన్పూర్ గ్రామం సర్వే నంబర్ 630లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణం, బేస్మెంట్ను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో జేసీబీల ద్వారా తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.