GDWL: యువజన వారోత్సవాల సందర్భంగా జిల్లాలో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ప్రకృతి, పక్షులు, వారసత్వ కట్టడాలు, గ్రామీణ జీవన విధానం అంశాలపై ఫొటోలు ఈ నెల 22లోగా డీపీఆర్వో కార్యాలయానికి పంపాలని సూచించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.