ADB: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా, కౌన్సెలింగ్ పద్ధతిలో అధికారుల బదిలీలు నిర్వహించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సుదీర్ఘ కాలం ఒకే చోట పనిచేసి, అర్హత సాధించిన వారికి నూతన విధులను కేటాయించారు. బదిలీ అయిన అధికారులు వెంటనే విధుల్లోంచి రిలీవ్ అయి, కొత్త ప్రాంతాలలో బాధ్యతలు స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు.