NZB: రుద్రూర్ ప్రాంతీయ వరి, చెరకు పరిశోధన స్థానంలో ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కేవీకే, వరి, చెరకు పరిశోధన స్థానం అధిపతులు ఇందూధర్ రెడ్డి, పవనచంద్రారెడ్డిలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేఎన్ఎం 1638, ఆర్డీఆర్ 1200, 1162 సన్నరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.