సంగారెడ్డి జిల్లాలో మరో 156 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను రాష్ట్ర విద్యా శాఖకు పంపించామని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. అనుమతులిచ్చిన అనంతరం గ్రామంలో స్థానికంగా ఉండే మహిళలను ఇన్ స్ట్రక్టర్, ఆయాలను ఎంపిక చేసి ఈ విద్యా ఏడాది నుంచి నర్సరీ తరగతులను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.