SRCL: ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రానికి రోజుకు ఒక లారీ మాత్రమే వస్తుందని, ఇలాగే కొనసాగితే మరో నెల రోజులు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి ఎస్ఐ అశోక్ చేరుకొని రైతులకు నచ్చ చెప్పడంతో నిరసన విరమించారు.