HYDకు వందేళ్లుగా తాగునీరు అందిస్తున్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో పూడిక పెరిగి కెపాసిటీ తగ్గుతోంది. సైంటిఫిక్ డీ-సిల్టింగ్ పనులు జరగక, రెండు జలాశయాల్లో 40 శాతానికి పైగా పూడిక పేరుకుపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. దీంతో కెపాసిటీ తగ్గి, అత్యధిక నీరు గేట్లు ఓపెన్ చేసి, మూసిలోకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది.