MBNR: సంస్కృతి, వారసత్వ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్న ఇంటాక్ మహబూబ్నగర్ చాప్టర్ కృషిని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా IAS కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం నిర్వహించిన “సెలబ్రేటింగ్ ఇండియా” పోస్టర్ల పోటీల విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.