WGL: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం సాధారణ సెలవుల అనంతరం గురువారం తిరిగి ప్రారంభమైంది. నేడు క్వింటాల్ తేజ మిర్చి ధర రూ. 18,900 పలికింది. అయితే తేజ మిర్చి ధర పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత వారం రోజులుగా ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.