TG: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 31,896 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 30న ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. కాగా ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేయనున్నారు.