KNR: కరీంనగర్ నగరపాలక సంస్థలో చేపడుతున్న ఎస్ఐఆర్ సర్వే విజయవంతానికి రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కోరారు. పార్టీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ఓటరు జాబితా సవరణ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మరణించిన, నకిలీ ఓటర్ల పేర్ల తొలగింపుతో పాటు అర్హులైన కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.