RR: గ్రేటర్ HYDలో క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ సేవలు మెరుగు పరిచారు. ఇప్పుడు MNJ క్యాన్సర్ ఆసుపత్రికే రానవసరం లేదు. వనస్థలిపురం, కొండాపూర్ జిల్లా ఆసుపత్రుల్లో డే-కేర్ విధానంలో ఉచిత కీమో సేవలు అందిస్తున్నారు. దీంతో ఎంఎన్జే ఆసుపత్రికి పదేపదే వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయి. మరోవైపు లైఫ్ స్టైల్ వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.