చాలామంది తమ జీవితంలో గొప్ప మార్పు రావాలని కోరుకుంటారు. కానీ, వారు తమ పాత జీవితాన్నే కొనసాగిస్తారు. కొత్త పంథాలో ముందుకు సాగినప్పుడే ఎదుగుదల కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ చేయని పనులు చేసినప్పుడే నూతన ఫలితాలొస్తాయి. సౌకర్యవంతమనే చట్రం నుంచి బయటపడనంత వరకూ జీవితంలో ఎలాంటి మార్పు రాదు.