ఒక రోజులో మహిళలు 25 గ్రాములు, పురుషులు 36 గ్రాములకు మించి చక్కెర తీసుకోరాదని అమెరికా హార్ట్ అసోసియేషన్ సూచించింది. ఈ నేపథ్యంలో రోజువారీ మీరు తీసుకునే చక్కెరను లెక్కేసుకోండి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను తినేటప్పుడు దాని లేబుల్‌పై ప్రచురించే చక్కెర శాతాన్ని తప్పక గమనించి తీసుకుంటే మంచిది.