AP: ఈరోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఈ భేటీలో అధినేత చంద్రబాబు ఉండవల్లి నుంచి వర్చువల్‌గా పాల్గొంటారు. ప్రధానంగా ఈనెల 27, 28 తేదీలలో నిర్వహించే ‘మహానాడు’ ఏర్పాట్లు, అక్కడ ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.