దేశవ్యాప్తంగా పాల ధరలు పెరగడంతో తాజాగా బ్రెడ్ ధరలు కూడా పెరిగాయి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్, ముడి పదార్థాల దిగుమతి ఖర్చుల కారణంగా ధరలు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రముఖ మోడర్న్ బ్రెడ్ ఒక్కో ప్యాక్‌కు రూ.5 వరకు పెంచింది. 400 గ్రాముల శాండ్విచ్ బ్రెడ్ రూ.40 నుంచి రూ.45కు, హోల్ వీట్ బ్రెడ్ రూ.55 నుంచి రూ.60, మల్టీగ్రెయిన్ బ్రెడ్ రూ.60 నుంచి రూ.65కు చేరింది.