ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి మధిర వెళ్తున్న బస్సు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.