NRML: బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు అంగన్వాడీ టీచర్లు, తల్లులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. పాఠశాలల్లో వసతులను వివరిస్తూ విద్యార్థుల నమోదు పెంచేలా కృషి చేయాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఉదయం 12 గంటల లోపు ముగించాలని, వివరాలను ఎంఈవోల ద్వారా జిల్లా కార్యాలయానికి పంపాలని కోరారు.