WNP: పెద్దమందడి మండలం మోజర్లలోని వారాహి, చాముండీ రైస్ మిల్లులలో ధాన్యం నిల్వల్లో తేడా ఉండటంతో మిల్లుల యజమానులపై కేసు నమోదు చేశామని ఎస్సై జలంధర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆయా మిల్లులలో సుమారు 79,907 బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. మిల్లుల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.