HYD: ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీసులు ఏఐ ఆధారిత ‘ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్’ విధానాన్ని తీసుకురావాలని సిద్ధమవుతున్నారు. వాహన రద్దీని ముందుగానే అంచనా వేసి, ట్రాఫిక్ సిగ్నళ్ల సమయాలను ఆటోమేటిక్గా మార్చే ఈ సిస్టమ్ యూరప్ సహా పలు దేశాల్లో అమల్లో ఉంది. ప్రమాదాలు, రోడ్డు పనుల ప్రభావాన్ని ముందే గుర్తించనున్నారు.