NLR: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయని ఆర్ఐ ఓ వరప్రసాదరావు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సీసీ కెమెరాల మధ్య పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.