ములుగులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు సాంబయ్య విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందాడు. అస్వస్థతకు గురైన ఆయన, మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకుని షెడ్డు కింద విశ్రాంతి తీసుకున్నారు. కొంతసేపటి తర్వాత స్పందన లేకపోవడంతో తోటి కార్మికులు ఏరియా ఆస్పత్రికి తరలించి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.