JN: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ ధర్మకంచ మినీ స్టేడియంలో స్పోర్ట్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లాంగ్ జంప్, షాట్పుట్, 100, 800 మీటర్ల రేసులు ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.