BHPL: కాలేశ్వరంలో రేపటి నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల భద్రత కోసం సరస్వతి ఘాటు వద్ద 100 మంది శిక్షణా పొందిన గజ ఈతగాళ్లను నియమించారు. ఘాటు వద్ద పుష్కర స్నానం ఆచరించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సేఫ్టీ బోట్స్, లైఫ్ రింగ్స్, SDRF బృందాలను సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.