హన్మకొండ జిల్లా సుబేదారిలోని MLA క్యాంపు కార్యాలయంలో 41 మంది CMRF లబ్ధిదారులకు రూ. 13.68 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను బుధవారం సాయంత్రం MLA నాగరాజు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు CMRF భరోసాగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.