CTR: కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఒక్కరోజు పర్యటన బుధవారం విజయవంతంగా ముగిసింది. సీఎం దంపతులు కుప్పం గ్రామదేవత తిరుపతి ప్రసన్న గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరిగి వెళ్లేటప్పుడు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ వీడ్కోలు పలికారు. పర్యటన ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.