MHBD: ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన గంగిశెట్టి అఖిల అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచారు. అఖిలను గ్రామ సర్పంచ్ మాదారి ప్రశాంత్ ఆధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అఖిల మండల టాపర్ రావడం గ్రామానికి ఎంతో గర్వకారణమని అన్నారు.