MHBD: తండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కాదునూరి సతీష్ (38) అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు తేజ, జోష్నా ఉన్నారు. కుమారులు లేకపోవడంతో చిన్న కూతురు తండ్రికి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది. ఇది చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.