WNP: రాజపేటలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. రూరల్ ఎస్సై రిషికేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎస్సై సూచించారు.