ADB: లొంగిపోయిన నక్సలైట్లకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గతంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ సీపీఐ మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సోమవారం ఇళ్ల స్థలాల పట్టాలను ఆదిలాబాద్లో అందజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.