విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ మ్యూజిక్ అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నుట్లు సమాచారం.