కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ వాస్తవ్యులు MAX INFRA PRIVATE లిమిటెడ్ అధినేత BVVSN రాజు వారి కుటుంబ సభ్యులు రూ.10,00,000 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.