W.G: బ్రాహ్మణ చెరువు భట్లమగుటూరు ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం ఆరబోస్తున్నారు. సాగు చేసిన పంట చేతికొచ్చిన వేళ, కల్లాలు లేకపోవడంతో రహదారులే దిక్కయ్యాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం వచ్చే వరకు విధిలేక రబీ, ఖరీఫ్ సీజన్లలో రోడ్లనే ఆశ్రయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.