NRML: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఆసుపత్రుల పనితీరును పరిశీలించిన ఆమె, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.