ATP: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వినతులను స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ సమయ వేళలను మార్పు చేశామన్నారు. అర్జీ దారులు గతంలో ఇచ్చిన అర్జీకి సంబంధించిన స్లిప్పులను తీసుకొని రావాలని సూచించారు.